26 March, 2026 | 3:07 AM

ఖమ్మం @14

26-03-2026 12:15 AM

మారనున్న ‘ఖమ్మం’ రూపురేఖలు

ఉమ్మడి జిల్లాకు పెరగనున్న మరో నాలుగు నియోజకవర్గాలు..?

పెరగనున్న మరో పార్లమెంట్ నియోజకవర్గం..?

‘పునర్వీభజన’ పై ప్రజల్లో అసక్తి

లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం..?  

డిలిమిటేషన్ సమయం రానే వచ్చింది.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. నియోజకవర్గాలను పెంచాలని నిర్ణయం తీసుకుంది.. అతి త్వరలో నియోజకవర్గాల పునర్వీభజన జరుగుతుందని కేంద్రం తెల్చి చెప్పింది.. దీంతో ఖమ్మం జిల్లాలో నియోకవర్గాల రూపురేఖలు మారే అవకాశం వచ్చింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానం పెరిగే అవకాశం ఉంది.

అదే జరిగితే ఖమ్మం జిల్లా కాస్తా 14 అసెంబ్లీ నియోజకవర్గాలుగా అవతరించనుంది..? అయితే డిలిమిటేషన్  ప్రక్రియపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది..  ఏఏ గ్రామాలను ఏఏ నియోజకవర్గాల్లో కలుపుతారో..? ఏ నియోజకవర్గానికి ఏఏ రిజర్వేషన్ వస్తుందనే విషయం పై ప్రజలు చర్చాంశనీయంగా మారింది.. 

కూసుమంచి, మార్చి 25,(విజయక్రాంతి): అందరు అనుకునట్లుగానే దేశంలో నియోజకవర్గాల పునర్వీభజన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించింది. 2011 జనాభ లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్వీభజన జరుగుతుందని కేంద్ర మంత్రులు ప్రకటించారు.

ప్రస్తుతం ఉన్న నియోకజవర్గాల్లో 50శాతం నియోజకవర్గాలను పెంచాలని కేంద్రం భావించినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని రాష్ట్రాలకు భారీగా కొత్త నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఒక వైపు కేంద్రం దేశవ్యాప్తంగా కుల గణన కార్యక్రమాన్ని ప్రారంభించగా, మరో వైపు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచేందుకు నియోజక వర్గాల పునర్వీభజన చేస్తున్నామని ప్రకటించడం అందర్ని అశ్ఛర్యపరిచిందనే చెప్పాలి. 

ఖమ్మం జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గాల పునర్వీభజన చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఉన్న నియోజకవర్గాలతో పాటు 50శాతం నియోజకవర్గాలను పెంచాలనే కేంద్రం ప్రతినిపాధన అమలైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నాలుగు నుంచి ఐదు నియోకజవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాలు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి.

అయితే భద్రాద్రికొత్తగూడెం జిల్లా మొత్తం ఏజెన్సీ ప్రాంతం కావడం, జనాభా తక్కువ ఉండే అవకాశం ఉండటంతో ఒక స్థానం తగ్గే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో మూడు నియోజకవర్గాలు, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక నియోజకవర్గం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఖమ్మం జిల్లాలో 8 నియోజకవర్గాలు, భద్రాద్రికొత్తగూడెంలో 6 నియోజకవర్గాలు, మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

మరో పార్లమెంట్ నియోజకవర్గం పెరుగుతుందా..? 

ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క పార్లమెంట్ నియోజకర్గం మాత్రమే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు, మండలాలు మహుబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కలిసిపోయాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటి మాత్రమే పార్లమెంట్ స్థానం ఉంది. అయితే రాబోయే పునర్వీభజనలో 7 నియోజకర్గాలకు ఒక పార్లమెంట్ స్థానాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడదీసి, రెండు పార్లమెంట్ స్థానాలను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.. కొత్తగా ఏర్పాటు చేయాలనుకునే పార్లమెంట్ స్థానానికి దక్షణ అయోద్యగా పిలవబడే భద్రాద్రి రామయ్య పేరుతో ఉన్న ‘భద్రాది’ నియోజకవర్గంగా నామకరణం చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

పునర్వీభజనపై పెరుగుతున్న అసక్తి

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వీభజన చేస్తున్నామని కేంద్రం ప్రకటించడంతో ప్రజలో అసక్తి కనిపిస్తోంది..  ఎక్కడ చూసిన డిలిమిటేషన్ పైనే చర్చించుకోవడం గమనర్హం. ఏఏ మండలాలు, ఏఏ గ్రామాలు ఏ నియోజకవర్గంలో ఉంటాయనే విషయంపై చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామాలను ఆయా నియోజకవర్గాల్లో ఉంచుతారా..? లేదంటే 2009లో జరిగిన పునర్వీభజన తరహాలో గ్రామాలను, మండలాలను వేరువేరు జిల్లాలో, వేరువేరు నియోజకవర్గాల్లో కలుపుతారా..? అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఎన్ని కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి.. ఏఏ ప్రాంతాలతో కలిపి నియోజకవర్గాలుగా ఏర్పాటు చేస్తారని విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై  గ్రామీణ ప్రజలు సర్వత్ర చర్చించుకుంటున్నారు. 

మారనున్న ‘ఖమ్మం’  ముఖచిత్రాలు 

నియోజకవర్గాల పునర్వీభజన జరిగితే కచ్చితంగా జిల్లాల రూపురేఖలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు, జిల్లా ముఖచిత్రాలు మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని మండలాలు కొత్త నియోజకవర్గాలకు సిప్ట్ అయ్యే అవకాశం ఉందని, కొన్ని గ్రామాలు మండలాలను వదులుకుని కొత్త నియోజకవర్గంలో కలుస్తాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రూపురేఖలు మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2009లో ఖమ్మం జిల్లాలో ఉన్న కామేపల్లి మండలాన్ని భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో కలిపారు. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్న గార్లను మహుబూబాబాద్ జిల్లాలో, ఆ జిల్లాలో ఉన్న బయ్యారంను ఇల్లందు నియోజకవర్గంలో కలిపి అశ్ఛర్యానికి గురి చేశారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం జరిగబోయే నియోజకవర్గ విభజనలో ఉంటుందా..? అలాంటి మండలాలను, గ్రామాలను స్థానిక జిల్లాలో కలుపుతారా..? అనేది ప్రశ్నార్థికంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే నియోజకవర్గాల పునర్వీభజనలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.? వేచి చూడాల్సిందే మరీ..?