26 March, 2026 | 4:36 AM

ఐదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

26-03-2026 12:14 AM

నిజాంసాగర్ మార్చి 25 (విజయక్రాంతి) :  నిజాంసాగర్ మండలం లోని అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు ఐదవ తరగతి విద్యార్థు ల వీడుకోలు సమావేశాన్ని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.లాల్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదిగినప్పుడు ఉపాధ్యాయులు సంతోషిస్తారని ఆయన అన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్య పునాది లాంటిదని ఇక్కడ మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

అచ్చంపేట పాఠశాల అభివృద్ధికి దాతలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ముందుకు రావడం సంతోషంగా ఉందని వారి సహకారంతో రెండు తరగతి గదుల పనులను పూర్తి చేసుకొని అన్ని తరగతి గదులకు పెయింటింగ్ కూడా వేసుకోవడం జరిగిందన్నారు. ఇదంతా గ్రామస్తుల సహకారం వల్లే సాధ్యమైందన్నారు. అనంతరం మండల విద్యాధికారి వై. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ అచ్చంపేట పాఠశాలకు మండలంలోని ప్రత్యేకమైన గుర్తింపు ఉందని మండలంలో ఎక్కడ లేని విధంగా ఏ ఎక్స్ ఎల్ కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు.

ప్రభుత్వం రానున్న రోజుల్లో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యనందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన బ్రేక్ ఫాస్ట్ పథకం విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం పాఠశాలలో కంప్యూటర్ విద్య బోధన చేస్తున్న ఉపాధ్యాయులు ఎం సాయి ప్రసాద్ కు గ్రామస్తుల చేత సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, నిజాంసాగర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఏ. వెంకటేశం.

అచ్చంపేట సర్పంచ్ లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ బలరాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్, సిహెచ్ రమేష్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు. సలీమా బేగం  వార్డ్ వార్డు మెంబర్ సంతోష్ సిఆర్పిలు బి. శ్రీధర్ కుమార్, ఎం. వరలక్ష్మి పాఠశాల ఉపాధ్యాయులు యం.సాయి ప్రసాద్,యం.మౌనిక డి.సుష్మ. గ్రామ పెద్దలు నారాయణ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.