17 July, 2026 | 8:35 PM

Breaking News

నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •  

కారు ప్రమాదంలో నలుగురు మృతి

22-12-2025 11:59 AM

బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో వేగంగా దూసుకొచ్చిన కారు వెనుక నుంచి డంపర్‌ను ఢీకొన్న ఘటనలో ఇస్లామిక్ పండితుడితో సహా నలుగురు మరణించారని పోలీసులు సోమవారం తెలిపారు. నజీబాబాద్ సర్కిల్(Najibabad Circle) అధికారి నితేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నంగల్ పోలీస్ స్టేషన్(Nangal Police Station) పరిధిలోని జల్‌పూర్ గ్రామం సమీపంలో హరిద్వార్ రోడ్డుపై జరిగిందని తెలిపారు. 

ఆ కారు తన ముందు వెళ్తున్న డంపర్‌ను ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ధాటికి కారు తీవ్రంగా నుజ్జునుజ్జు అయిందని, మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు దాని తలుపులను కత్తిరించి తెరవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.