సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
30-03-2026 06:16 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ జబరి రవీందర్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ సహకారంతో చేపడుతున్న ఈ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్డు పనులు చేయడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్, వార్డు సభ్యులు ప్రవీణ్, రాజు, మోహన్, తిరుపతి, భారతి, సునీత, గ్రామస్తులు గణపతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.




