6 March, 2026 | 10:45 AM

వీఆర్‌కే పురంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన

06-03-2026 01:59 AM

వెంకటాపురం(నూగూరు), మార్చి 5(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్డు తోట మల్లికార్జునరావు ఇంటి దగ్గర నుండి బొజ్జ లక్ష్మీ ఇంటి వరకు ఐదు లక్షల వ్యయంతో ఎన్ ఆర్ ఈ జి యస్ నిధులతో సిమెంట్ రోడ్డు కు గురువారం సర్పంచ్ రమ్య శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో వి ఆర్ కె పురం సర్పంచ్ డి రమ్య, ఉపసర్పంచ్ పూనెం రాజేశ్వరి, వార్డు సభ్యులు డర్ర రవి, బద్ది ప్రశాంత్, చెరుకూరి అజయ్, వి బి ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, విబిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయుడు గారు, గారాపు వెంకటేశ్వర్లు, భార్గవ్, ఆంజనేయులు, భరత్, సుజాత తదితరులు పాల్గొన్నారు.