25 July, 2026 | 7:04 PM

ఈసీఈ డే.. తొలిముద్ద, యూనిఫాం పంపిణీ

25-07-2026 06:32 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని మోరంపల్లి బంజర్-1, 2 అంగన్‌వాడీ కేంద్రాల్లో శనివారం ఈసీఈ (ప్రారంభ బాల్య విద్య) డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తొలిముద్ద' ఉదయం అల్పాహార కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించారు. అనంతరం గ్రామ సర్పంచ్ బొర్రా సుభద్ర, ఉపసర్పంచ్ పొక్కుల రవి, పంచాయతీ కార్యదర్శి భవాని చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.

ప్రారంభ బాల్య దశలో పౌష్టికాహారం, నాణ్యమైన విద్య రెండూ పిల్లల సమగ్ర వికాసానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు దేవ కృపావరం, పద్మ, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.