25 July, 2026 | 4:56 PM

జిల్లా గిరిజన మోర్చా మాజీ అధ్యక్షుడు మరప రాజు మృతి

25-07-2026 04:03 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా  గిరిజన మోర్చా  మాజీ జిల్లా అధ్యక్షుడు మరుపు రాజు అనారోగ్యంతో  శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రధాన్ గూడ కు చెందిన ఆదివాసి గిరిజన ప్రధాన్  తెగకు చెందిన మరప రాజు బిజెపి పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ.. జిల్లాస్థాయి నాయకుడిగా  ఏదిగాడు. బిజెపి జిల్లా అధ్యక్షుడిగా , ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరపు రాజు బిజెపి పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. గత కొద్ది కాలంగా  అనారోగ్యంతో బాధపడుతూ.. ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని  మాజీ ఎంపీ , దివంగత బిజెపి  నాయకుడు రాథోడ్ రమేష్ తో పాటు ఎమ్మెల్యే పాయల శంకర్ సైతం  తమవంతుగా  ఆర్థిక సాయం అందించారు. వారి ఆర్థిక సాయంతో వైద్యం చేయించుకొని కోలుకొని  భాజపా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు .