బాధిత కుటుంబాలను పమర్శించిన మాజీ ఎమ్మెల్యే
23-03-2026 12:31 AM
నాగిరెడ్డిపేట్,మార్చి 22 (విజయక్రాంతి): మండలంలోని వదలపర్తి గ్రామ మాజీ సర్పంచ్ ప్రవీణ్ తల్లి మడ రాంబాయి ఇటీవల సర్గస్తులు అయినందున విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
అనంతరం పోచారం గ్రామ టేకులపల్లి గోపాల్ రెడ్డి సైతం మరణించడంతో వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఓదార్చారు.మనోధైర్యంతో ఉండి ముందుకు సాగాలని ధైర్యం నింపారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్,టిఆర్‌ఎస్ నాయకులు దుర్గా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




