పద్దం వెంకటేష్‌కు మాజీ ఎమ్మెల్యే మెచ్చా పరామర్శ
చుండ్రుగొండ. మార్చి 20 (విజయక్రాంతి): అశ్వారావుపేట(నియోజకవర్గం),చండ్రుగొండ(మండలం), బెండాలపాడు(గ్రామం)లో అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిలో గాయపడి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్దం వెంకటేష్ ని *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోని పరామర్శించారు.ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
అనంతరం. డి.ఎస్.పి. ఎల్ .ఆదినారాయణ ని కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే.గా ఉన్న సమయంలో ప్రశాంతంగా ప్రజలు ఉన్నారని.ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ బ్రస్టు పట్టిస్తోందని.అధికారం మదంతో అరాచకాలు చేస్తున్నారని అడ్డొచ్చిన వారిపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని.గత ఏడాది ఇదే వ్యక్తి బిఆర్‌ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డాడని ఆ వ్యక్తినే స్థానిక ఎమ్మెల్యే. ప్రోత్సహిస్తున్నాడని.ఆ అండ చూసుకొనే నేడు మళ్ళీ దాడికి పాల్పడ్డాడని.ప్రజలు అన్ని గమనిస్తున్నారని.కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని.నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తున్నామని సం.లో బిఆర్‌ఎస్ అధికారంలోకీ రావడం ఖాయమని వడ్డీతో సహా తిరిగి చెల్లించితీరుతామని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో తుంగారం సర్పంచ్ ప్రవీణ్ ప్రకాశ్,మాజీ సర్పంచ్లు పూసం వెంకటేశ్వర్లు,పండ్ల అంజన్ రావు,భూపతి రమేష్,మేడా మోహన్ రావు,నల్లమోతు వెంకట నారాయణ,బెండలపాడు ఉప సర్పంచ్ బానోత్ బాలు,గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల జానకి రాములు,సత్తి నాగేశ్వరావు,బానోతు రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.




