మండలంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పర్యటన
పలువురి కుటుంబాలకు పరామర్శ
గాంధారి, ఆగస్టు 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో బుధవారంనాడు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాతు సంగెం గ్రామ ఉప సర్పంచ్ బుచ్చి స్వామి తమ్ముడు ఇటీవల ప్రమాదంలో గాయపడగా ఆయన సంజును పరమర్శించారు. అదే గ్రామానికి చెందిన కళ్లెంపేట మల్లయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం మండల కేంద్రంలో కుమ్మరి జనార్ధన్ కొడుకు భరత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ నాయకులు మాజీ జడ్పీటీసీ తానాజీ రావ్, మాజీ ఏఎంసీ చైర్మన్ పెద్దబూరి సత్యం, మండల పార్టీ అధ్యక్షుడు శివాజీ రావు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, వార్డు సభ్యులు పత్తి సాయిలు, పార్టీ పట్టణ అధ్యక్షుడు తూర్పు సంతోష్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






