6 May, 2026 | 2:39 AM

ఆత్మ లింగేశ్వరస్వామి ప్రతిష్ఠాపనకు రావాలని.. మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

06-05-2026 01:13 AM

నాగిరెడ్డిపేట్, మే 5 (విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో శ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవం  పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుతూ నాగిరెడ్డిపేట్ మండలం మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్కు ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... లోక కళ్యాణార్థమై పెద్దఆత్మకూర్ గ్రామంలో సుందరమైన శిలా దేవాలయాన్ని నిర్మించుకొని వైభవంగా ఈ పరభవ వైశాఖ బ,,ఏకాదశి ఈనెల 13వ తేదీ బుధవారం నుండి వైశాఖ బ,,త్రయోదశి 15వ తేదీ శుక్రవారం వరకు త్రాహిన్యక దీక్ష విధానంలో శ్రీశ్రీశ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి ప్రతిష్ట భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమం మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 13వ తేదీన మొదటి రోజు గణపతి పూజ,పుణ్య వచన, అఖండదీపాస్థాపన, రక్షాబంధనం,వివిధ కార్యక్రమాలు,14వ తేదీ రెండవ రోజున ఆవహిత దేవత పూజనం,అవహిత దేవత ఆవనము,చండీ రుద్ర వివిధ కార్యక్రమాలు 15వ తేదీ మూడవ రోజున గర్త, బీజ,ధాతు,రత్న,వ్యాసంలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్కు వివరించారు.