9 August, 2026 | 3:23 PM

మాజీ ఎమ్మెల్యే గొర్ల సిద్ధయ్య కన్నుమూత

09-08-2026 02:11 PM

చేర్యాల,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) ధూళిమిట మండలం బైరాన్పల్లి కి చెందిన,చేర్యాల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొర్ల సిద్ధయ్య(Former Congress Party MLA Gorla Siddaiah) (95) కన్నుమూశారు.కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన,వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున చేర్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికై ఆయన విశేషంగా సేవలందించారు.సిద్ధయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు,అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.