14 July, 2026 | 4:58 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మద్దతు

24-04-2026 12:51 AM

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 23: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ముందు కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్‌ఎస్ మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. యాదగిరిగుట్ట డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజూ ఉధృతంగా కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు విధులను బహిష్కరించారు.

దీంతో జిల్లాలోని బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమ్మె శిబిరాన్ని సందర్శించి యాదగిరిగుట్ట డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులతో కలిసి నిరసనలో గొంగిడి సునిత మహేందర్ రెడ్డి  పాల్గొని ఆర్టీ సీ కార్మిక జేఏసీ చేపట్టిన సమ్మెకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు, సిపిఎం నాయకులు ఏఐటీసీ నాయకులు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.