23 March, 2026 | 6:43 PM

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్

23-03-2026 05:03 PM

రైతులకు 100% రుణ మాపి చేసినట్లు రుజువు చేస్తే నేలకు ముక్కు రాస్తా

మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి, మార్చి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం గారడి బడ్జెట్ను ప్రవేశ పెట్టిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు 100% రుణమాఫీ చేసినట్లు రుజువు చేస్తే తాను నేల కు ముక్కు రాస్తానని అన్నారు. పేదలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా బడ్జెట్ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు రైతు బరోస డబ్బులను ఎగగొట్టారని పేర్కొన్నారు.

రైతులకు పెట్టుబడి సాయం పంటలు వేసే సమయంలో ఇవ్వకుండా పంటలు కోసే సమయంలో ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి దేవుళ్లపై ఓట్లు వేసుకొని ఓట్లు అడిగి గద్దెనెక్కారని అన్నారు.

ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన చట్టబద్ధత బడ్జెట్ కల్పించలేదన్నారు. రైతులకు రాష్ట్రంలో 100% రుణమాఫీ చేయలేదన్నారు. రుణమాఫీ 100% చేసినట్లు రుజువు చేస్తే తాను నేల కు ముక్కు రాస్తానని అన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కుంభాల రవి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.