23 March, 2026 | 6:39 PM

పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి

23-03-2026 05:06 PM

సర్పంచ్ మోర సంధ్యా భిక్షం

తుంగతుర్తి,(విజయక్రాంతి): పశుపోషకులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు టీకాలు వేయించాలని సర్పంచ్ మోర సంధ్య భిక్షం అన్నారు. సోమవారం మండల పరిధిలోని కరివిరాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ వ్యాధి సోకితే పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు గ్రామంలో 74  పశువులకు టీకాలు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల  పశు వైద్యాధికారి డాక్టర్ ఆకుల నరేష్, సిబ్బంది రవి, శ్రీను, రైతులు పాల్గొన్నారు.