20 August, 2026 | 4:29 AM

రోడ్డున పడ్డాం

20-08-2026 01:36 AM

తెలంగాణ భవన్‌లో 22ఏ బాధితుల ఆవేదన

బాధితులకు భరోసానిచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రభుత్వం 22ఏ నిషేధిత భూములు, యూఎల్సీల పేరుతో ప్రైవేట్ ఆస్తులపై విధించిన నిషేధాల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు బుధవారం పోటెత్తారు. తెలంగాణ భవన్‌ను తమ సమస్యలను తీర్చే జనతా గ్యారేజ్‌గా భావించి రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది బాధితులు తరలివచ్చారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 

కాలనీ మధ్యలో ఉన్న ఇల్లు 22ఏ లోకి ఎలా పోతుంది?

2017లో బ్యాంకు లోన్ తీసుకుని కాలనీ మధ్యలో ఇల్లు కొనుక్కున్నాను. ఇటీవల ఉద్యోగం పోవడంతో ఇల్లు అమ్ముకుని వ్యాపారం చేసుకుందామని జూలై 1న రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే మా ఆస్తి 22ఏ లో ఉందని చెప్పారు. ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు పెట్టుకుని రెండు నెలలైనా దిక్కులేదు. ఇల్లు కొనే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేశాను. ఆయన లోన్ ఈఎంఐ కూడా కడుతున్నాడు. కానీ రిజిస్ట్రేషన్ కావడం లేదు. కాలనీ మధ్యలో ఉన్న ఇల్లు ఉన్నట్టుండి 22ఏ లోకి ఎలా పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ఈ పరిస్థితికి ఏం సమాధానం చెబుతారు.

 రాజేష్ (బాధితుడు) 

ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి 

1995లోనే లేఅవుట్ అనుమతులు పొంది వందలాది ఇళ్లు నిర్మించుకున్నాం. కానీ సర్వే నంబరు 330ని ఒక్కసారిగా 22ఏలో పెట్టారు. గత జూలైలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చినా దాన్ని చెత్తబుట్టలో వేశారు. ప్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, 50 సెటిల్మెంట్ల కోసం లేదా 30% కమీషన్ డిమాండ్ల కోసమే ఈ లేఅవుట్లను అడ్డం పెట్టుకుని ప్రజలను ఆగం చేస్తోంది.

 దేవేందర్‌రావు (హెచ్‌ఎండీ హౌసింగ్ కాలనీ సొసైటీ సెక్రటరీ)

ప్రభుత్వమే అనాథలను చేస్తే ఎక్కడికెళ్లాలి?

రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని, స్టాంప్ డ్యూటీ చార్జీలు మొత్తం చెల్లించిన తర్వాత.. తీరా రిజిస్ట్రేషన్ రోజున మీ ఆస్తి 22ఏ నిషేధిత జాబితాలో ఉంది అని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నిలబెట్టి ఇలా హ్యాండ్ ఇస్తే మే ము ఎక్కడికి వెళ్లాలి.. ప్రభుత్వమే మ మ్మల్ని అనాథలను చేస్తే మా ఆవేదన ఎవరు వింటారు.

 మోహన్‌రెడ్డి (బాధితుడు) 

కాలనీ మొత్తం 22ఏలో పెట్టారు

10 ఏళ్ల క్రితం క్లియర్ డాక్యుమెంట్లతో, బ్యాంకు లోన్ ద్వారా ప్రాపర్టీ కొన్నాను. అవసరం ఉండి అమ్ముకుందామని స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత ప్రొహిబిషన్ లిస్టులో ఉందన్నారు. రెం డు సర్వే నంబర్ల సాకుతో కాలనీ మొ త్తం 22ఏలో పెడితే సామాన్య కు టుంబాల పరిస్థితి ఏంటి? 22ఏ అని ముద్ర వేస్తే మా భూమిని ఎవరు కొం టారు? బీఆర్‌ఎస్ పార్టీయే మమ్మల్ని ఈ రా బందుల ప్రభుత్వం నుంచి కాపాడాలి.

 శ్రీనివాస్ (అమీన్‌పూర్, బాధితుడు)

మంత్రి పొంగులేటికి విన్నవించినా పరిష్కారం లేదు

మా కాలనీలో 1500 ఇళ్లు ఉన్నా యి. గతంలో ఎలాంటి ఇబ్బంది లే కుండా రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను ఇప్పుడు యూఎల్సీ పేరుతో ఆపే శారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విన్నవించినా ఎలాంటి పరి ష్కారం చూపలేదు.

 బిఎన్ నగర్, ఉప్పల్ బాధితులు