బాధిత కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ
29-08-2026 03:44 PM
దేవరుప్పుల, ఆగస్టు 29 (విజయ క్రాంతి): మండలంలోని కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాలీల్ కుమారుడు మహమ్మద్ నసిర్ (21) ఇటీవల మల్లన్న గండి రిజర్వాయర్ లో పడి చనిపోగా శనివారం బాధిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి ఓదార్చి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు పల్లా సుందర రాంరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేష్ మాజీ ఎంపీపీ సోమన్న సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.






