ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ల ఫిర్యాదు
ఎల్బీనగర్, మార్చి 9: ఎల్బీనగర్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరి ష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. హయత్‌నగర్ డివిజన్‌లోని కుమ్మరి కుంట చెరువును అభివృద్ధి చేయాలని మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి కోరారు.
అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో ఉన్న పార్కు స్థలాలకు సరైన రక్షణ లేకపోవడంతో కొంతమంది వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని, పార్క్ స్థలాలకు వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రాధా ధీరజ్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, పవన్‌కుమార్, రంగ నర్సింహగుప్తా, ప్రేమ మహేశ్వర్‌రెడ్డి, అరుణా సురేందర్ యాదవ్ పాల్గొన్నారు.




