అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
18-08-2026 07:17 PM
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు, షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్జున అవార్డులకు ఎంపికైన గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్‌లు తెలంగాణకు, దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా, జాతీయ క్రీడా పురస్కారాలు–2025 అందుకున్న విజేతలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడారంగంలో వారు కనబరిచిన అంకితభావం, పట్టుదల, కృషి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించి, ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.






