18 August, 2026 | 8:36 PM

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి

18-08-2026 07:09 PM

నిస్పాక్షికంగా సేవలందించాలి

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

రేగొండ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ  వార్షిక తనిఖీ

భూపాలపల్లి,(విజయక్రాంతి): ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నిస్పాక్షికంగా సేవలు అందించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్,  వార్షిక తనిఖీల్లో భాగంగా రేగొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ మొక్క నాటారు.

ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణతో పాటు పెండింగ్ కేసులు, సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల నమోదు, బ్లూ కోల్ట్ వాహనాల పనితీరు, సీసీ కెమెరాల నిర్వహణపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని, లోపాలున్న కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు.

స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో నవీకరించాలని సూచించారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సంపత్ రావు, గణపురం సీఐ కర్ణాకర్ రావు, రేగొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.