calender_icon.png 6 February, 2026 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపారవేత్త కోసం.. కాంగ్రెస్ శ్రేణులు దూరం

06-02-2026 12:59:50 AM

  1. ప్రచారంలో పాల్గొనని సీనియర్ నేతలు 

ముఖ్యనేతలు సైతం పార్టీకి దూరం 

సీనియర్లందరికీ రాష్ట్ర నామినేటెడ్ పదవుల హామీ

పెద్ద సారుకే రాష్ట్ర నామినేటెడ్ పదవి లేదు.. సీనియర్ కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర నామినేటెడ్ పదవుల హామీ ఇచ్చిన సదరు నేత

నారాయణపేట. ఫిబ్రవరి 5(విజయక్రాంతి) : నారాయణపేట పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తలో దిక్కుగా చెల్లా చెదురు అయినట్లు గా ఉంది. ముఖ్యంగా ఒక్క ప్రముఖ బులియన్ మర్చం ట్ వ్యాపారవేత్త కళ్లలో ఆనందం కోసం  కాంగ్రెస్ పార్టీనీ బలిపీఠం మీద పెట్టిన చందంగా తయారైంది . ఈ నేపథ్యంలో దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీనీ జిల్లా ప్రజ లు అధికారం నుండి దూరం పెట్టిన సంగతి ప్రజలకు తెలిసిందే.

చావు తప్పి కన్నులొట్టపోయినట్లు బిఆర్ ఎస్ పార్టీ చేసిన తప్పిదం, తాజా మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి  పై ఉన్న వ్యతిరేకత ప్రస్తుత ఎమ్మెల్యే గెలుపుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.దీంట్లో భాగంగానే ఎమ్మెల్యే రెండు మూడు నెలలుగా ప్రజలకు దూరంగా ఉండటంతో మా జీ డీసీసీ అధ్యక్షులు షాడో ఎమ్మెల్యే గా ము న్సిపల్ ఎన్నికల్లో బహిరంగ సభలో పాల్గొని హామీలు సైతం ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ బులియన్ మర్చంట్ వ్యాపారవేత్త కళ్లలో ఆనందం చూడటం కోసం అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి నేతలను సైతం కౌన్సిలర్ అభ్యర్థులు గా పోటీ చేయటానికి అవకాశం కల్పించక పోగా సదరు నేతలు వారికి జరిగిన అవమానం భరించలేక,జీర్ణించుకోలేక ఎన్నికల్లో సైతం ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేక పోతున్నారు. దీంట్లో భాగంగానే ఆయా వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయటానికి అభ్యర్థులు లేకపోవటంతో ఏ రాజకీ య నేపథ్యం లేని నాయకులతో పోటీ చేయిస్తున్న ఘనత సదరు నేతకే చెందుతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కొన్ని వార్డుల్లో సైతం బిజెపి, బిఆర్ ఎస్ పార్టీ లకు సంబంధించిన నాయకులు  గెలుపొందేటట్లు ప్రభా వం చూపని నాయకులను సైతం పోటీలో ఉంచిన చరిత్ర ఘన చరిత్ర సదరు నేత కే చెందుతుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు బాహాటంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులకు గెలుపు నల్లేరుపై నడకలా తయారైన చందంగా తయారైంది.

కనీసం చైర్ పర్సన్ గా పోటీ చేస్తున్న అభ్యర్థిని సైతం ప్రజలకు ఏనాడు రాజకీయంగా సేవచేసిన దాఖలాలు లేవని కనీసం ఆ వార్డు ప్రజలకు కూడా ముఖ పరిచయం లేని వారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డబ్బే ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించే ప్రయత్నం చేయడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొనలేక పోవటంతో పాటు తలో దిక్కుగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమవుతున్నారని ఆయా వార్డుల్లో ప్రజలు యువకులు తీవ్రంగా విమర్శలు సైతం చేస్తున్నారు. 

ఏది ఏమైనా ఒక్క ప్రముఖ బులియన్ మర్చంట్ వ్యాపారవేత్త కోసం చైర్ పర్సన్ సీటును , ఎన్నో ఏళ్లుగా చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కి దూరంగా పెట్టిన పట్టణ ప్రజలు ఈసారైనా ఎమ్మెల్యే హయం లో నైనా గెలుపొందుతామనే ఆశలు కూడా అడియాశలు అవుతున్నాయని సీనియర్ నేతలు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రతి పక్ష పార్టీలకు చైర్ పర్సన్ పదవిని బంగారు పళ్ళెంలో అప్పగిస్తున్నట్లు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.