అన్నదాన కార్యక్రమానికి అపూర్వస్పందన
18-03-2026 06:38 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): అమావాస్యను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం ఎదురుగా శ్రీ అన్నపూర్ణ సేవా సమితి సుల్తానాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.
ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సుల్తానాబాద్ కు చెందిన శ్రీ అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.




