19-02-2026 01:33:24 PM
వేట ముమ్మరం
న్యూఢిల్లీ: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు(Maoist leaders) ఉన్నారని అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు నక్సల్స్ మిషన్(Naxals' mission) దృష్ట్యా మావోయిస్టుల వేట ముమ్మరం చేశాయి. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో(Chhattisgarh-Telangana border) భద్రతా బలగాలు ఆపరేషన్ కేజీహెచ్-2(Operation KGH-2) చేపట్టాయి. సీఆర్పీఎఫ్, ఛత్తీస్ గఢ్ పోలీసులు ఆపరేషన్ కర్రెగుట్టలు హిల్స్-2 చేపట్టాయి. బీజాపూర్ జిల్లా పరిధి నంబి నుంచి బలగాల వేటా కర్రెగుట్టల వరకు వ్యాపించింది.
కర్రెగుట్టల సరిహద్దు(Karregutta border) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు 2 వేల మంది భద్రతా బలగాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ, జూనియర్ క్యాడర్ బెటాలియన్ ఇన్ ఛార్జ్ కేసా సోధి కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కర్రెగుట్టల్లోని తడపల, పామునూరు, మొరుమూరు, డోలీలో నిత్యం ఆపరేషన్ కొనసాగుతోంది.
కేంద్ర ప్రభుత్వం(Central Government) 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదం నిర్మాలనా లక్ష్యంగా పెట్టుకుంది. అటు సుక్మా జిల్లాలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కిష్టారం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు భారీ స్మారక స్థూపాలను గుర్తించిన బలగాలు వాటిని కూల్చివేశారు. గడ్చిరోలి అటవీ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ లో మహారాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. 44 మావోయిస్టు స్థూపాలను బలగాలు ధ్వంసం చేశాయి.