1 May, 2026 | 2:49 AM

జొన్న చేనులో అగ్నిప్రమాదం

01-05-2026 12:03 AM

బోథ్, ఏప్రిల్ ౩౦ (విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రం సమీపంలోని మేడి శివారంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో పది ఎకరాలలో ముగురు రైతులకు చెందిన జొన్న పంట దగ్ధమైంది. మండల కేంద్రానికి చెందిన సింగం రమణకు చెందిన 8 ఎకరాలలో జొన్న పంటకు నిప్పు అంటుకోగా స్థానిక రైతులు కష్టించి మూడు ఎకరాల పంటను కాలకుండా మంటల ను ఆర్పి వేశారు.

అంతేగాక ఆయన పక్కనే ఉన్న మాధవ్‌కు చెందిన మూడు ఎకరాలు గోవిందుకు చెందిన రెండు ఎకరాల్లో జొన్న పంటకు నిప్పు పట్టుకొని పూర్తిగా దగ్ధమైంది. చేతికి అందిన పంట ఆకస్మికంగా జరిగిన అగ్నిప్రమాదంలో నష్టం జరగడం వల్ల రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా.. అయినా సకాలంలో ఫైర్ ఇంజన్ రాలేదని రైతు లు అంటున్నారు. తామే మంటను ఆర్పీ వేయడం జరిగిందని రైతులు వెల్లడించారు.