21 April, 2026 | 2:43 AM

ఎరిత్రో పరిశ్రమలో అగ్ని ప్రమాదం!

21-04-2026 01:19 AM

జిన్నారం/అమీన్‌పూర్ ఏప్రిల్ 20(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎరిత్రో పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఏబీ బ్లాక్‌లు బ్లాక్‌లు పూర్తిగా దహనం అయ్యాయి. ప్రమాదం సమయంలో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు సురక్షితంగా బయటపడటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పరిశ్ర మలో బాయిలర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు కా ర్మికులు చెబుతున్నారు. 

మంటలు ఒక్కసారిగా ఉధృతం కావడంతో రెం డు బ్లాక్లు పూర్తిగా దహనమయ్యాయి.  సమాచారమందుకున్న ఫైర్ ఇంజన్లు, నీటి ట్యాంకర్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఘటన స్థలాన్ని బొ ల్లారం సీఐ రవీందర్ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.