ప్యాట్ కమిన్స్‌కు జరిమానా
ముంబై, మే 13: గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు జరి మానా పడింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీ త సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ స్లో ఓవర్‌రేట్ నమో దు చేయడం ఇదే తొలిసారి.
రెండోసారి ఇదే తప్పిదం రిపీటైతే కమిన్స్‌కు రూ.24 లక్షల జరిమానాతో పాటు మిగిలిన జట్టు సభ్యులందరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. కాగా ఈ సీజన్‌లో పలు జట్లు ఈ స్లో ఓవర్ రేట్‌తో ఇబ్బంది పడుతున్నాయి. మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతుండడంతో బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులకు సమయం పడుతోంది. దీంతో జట్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోతున్నాయి. ఇది లా ఉంటే గుజరాత్‌పై ఓటమి తర్వాత పా యింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానం లో ఉంది.






