14 May, 2026 | 3:08 AM

ఇంగ్లాండ్, విండీస్‌తో భారత్ వార్మప్ మ్యాచ్‌లు

14-05-2026 02:12 AM

మహిళల టీ20 ప్రపంచకప్

దుబాయి, మే 13: ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు మరో నెలరోజులే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే టోర్నీలో ఆడుతున్న అన్ని జట్లనూ దాదాపుగా ప్రకటించారు. తాజాగా ఐసీసీ ఈ మెగాటోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది.

వరల్డ్‌కప్ జూన్ 12 నుంచి మొదలుకానుండగా దాని కంటే వారం రోజుల ముందు వార్మప్ మ్యాచ్‌లు ఉండబోతున్నాయి. అక్కడి పరిస్థితులకు అలవాటుపడేందుకు జూన్ 6 నుం చి 10 వరకూ వార్మప్ మ్యాచ్‌లు ఏర్పాటు చేశారు. భారత్ మహిళల జట్టు జూన్ 8న వెస్టిండీస్‌తోనూ, జూన్ 10న ఇంగ్లాండ్‌తో నూ ఆడనుంది. ఈ రెండు వార్మప్ మ్యాచ్‌లకూ కార్డిఫ్ నేదిక కానుంది. ఇదిలా ఉంటే ఈ సారి మహిళల టీ20 ప్రపంచకప్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది.