4 May, 2026 | 3:40 PM

Breaking News

డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •  

ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా

04-05-2026 02:32 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పల్లె బోగుడ తండా గ్రామపంచాయతీ ప్లాస్టిక్ నిషేధించాలని ఉద్దేశంతో గ్రామ సర్పంచి పార్వతి శంకర్ పాలకవర్గం సభ్యులు జిపి పరిధిలో గల చాయ్ హోటలలో ప్లాస్టిక్ గ్లాస్ తొలగించి గాజు గ్లాసుల్లో మాత్రమే చాయిని ఇవ్వాలని త్రాగాలని గ్రామ సర్పంచ్ పార్వతి శంకర్,పాలకవర్గం కలిసి 150 గాజు గ్లాసులను తీసుకువచ్చి జిపి పరిధిలోని చాయ్ హోటళ్లకు 20,30 గాజు గ్లాసులను అందజేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ పార్వతి శంకర్ తెలిపారు.

గ్రామపంచాయతీ తీర్మానానికి ఎవరైనా వ్యతిరేకంగా ప్లాస్టిక్ గ్లాసులలో చాయిని ఇచ్చినవారికి 3000 వేల,,రూపాయలు, త్రాగినవారికి మూడు వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని తండ ప్రజల సహకారంతో ముందుకు తీసుకురావడం జరిగిందని దీనికి అందరూ సహకరించి ప్లాస్టిక్ని నిషేధించి గాజు గ్లాసులోనే మాత్రమే చాయిని తాగాలని తెలిపారు. తాండ ప్రజల ఆరోగ్యమే తన ముఖ్యమని ఉద్దేశమని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పార్వతి శంకర్, ఉప సర్పంచ్ వనిత వినోద్, పాలకవర్గం సభ్యులు తండా ప్రజలు పాల్గొన్నారు.