గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం
కామారెడ్డి, ఆగస్టు 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన సర్కిల్ ఇన్స్పె క్టర్ ఎం.మహేష్ ను గ్రామస్తులు, మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. కామారెడ్డి పట్టణం లో వశిష్ట కాలేజీలో అభినందన సభ నిర్వహించారు. తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామస్తులు, చిన్న నాటి మిత్రులు, క్లాస్ మేట్స్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.
ఇటీవల సాహసోపేత బైక్ యాత్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సాధించారు. లడక్ లో 2,100 కిలోమీటర్లు ప్రయాణించి ఎత్తయిన రహదారి ఉమ్లింగ్ పాస్ను విజయవంతంగా అధిగమించిన విషయాలు వివరించారు. ఎత్తయిన రహదారి ఉమ్లింగ్ పాస్ను కఠినంగా 7రోజుల పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్బంగా దేమికలానకు చెందిన గ్రామస్తులు, యువకులు, చిన్న నాటి మిత్రులు, డిగ్రీ క్లాస్ మేట్స్ పాల్గొని సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో తాడ్వాయి మాజీ ఎంపిపి రాజు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, మిత్రులు రాంశెట్టి భూపతి, మధుసుధన్ రెడ్డి, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






