గంజాయి చాక్లెట్ల రవాణా ముఠా గుట్టురట్టు
23 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం... నలుగురు అరెస్ట్
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను కుత్బుల్లాపూర్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు గంజాయి చాక్లెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ ఘటనలో సుమారు 23 కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గాజులరామారం, మహాదేవపురం ప్రాంతాలకు చెందిన జ్యోతి, కమల్ సింగ్, నేపాల్ సింగ్, దీపక్ సింగ్ లుగా పోలీసులు గుర్తించారు.
విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెళ్లడయ్యింది. నిందితులను జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. గంజాయి చాక్లెట్ల సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, వీటి విక్రయానికి సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






