21-02-2026 09:27:39 PM
– రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): మున్సిపల్ వైస్ చైర్మన్ పెండాల రాజు, అతని సోదరుడు పెండాల హరికృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన ఆర్థిక సహాయ హామీ అమలులో భాగంగా 17వ వార్డులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
17వ వార్డుకు చెందిన ఆలూరి ఆదిలక్ష్మి కుమార్తె జెసిక లక్ష్మీదేవి రూపంలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా ముందుగా ఇచ్చిన హామీ మేరకు పెండాల రాజు, పెండాల హరికృష్ణలు ఆదిలక్ష్మి నివాసానికి వెళ్లి రూ.5,000 నగదు సహాయాన్ని స్వయంగా అందించారు. ఆడబిడ్డ పుట్టిన ప్రతి కుటుంబానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా సమాజంలో సానుకూల సందేశం పంపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాడిశెట్టి రాజు, ఎస్‌డీ బాబా, జియా, ఆలూరి విజయ్, హసీనా తదితరులు పాల్గొన్నారు.