1 June, 2026 | 5:25 PM

ఘనంగా గంగమ్మ తల్లి, చింతలమ్మ అమ్మవార్ల జాతర

01-06-2026 04:33 PM

మఠంపల్లి: మండల పరిధిలోని పెదవీడు గ్రామంలో గంగమ్మ తల్లి, చింతలమ్మ అమ్మవార్ల జాతర సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో అమ్మవార్లకి సాంప్రదాయంగా పూజలు నిర్వహించారు. ముందుగా భక్తులు బిందెల్లో నీటిని తీసుకొని,మంగళ హారతులతో డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని గంగమ్మ తల్లి, చింతలమ్మ అమ్మవార్ల విగ్రహాలకు శుద్ధి చేసి కాయ కర్పూరాలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పెరిక కుల కోపరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులు గ్రామస్తులపై ఎల్లవేళలా ఉండాలని పూజలు చేసినట్లు తెలిపారు.