పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు పూర్తికానున్నాయి
బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్
32 లక్షల సిసి రోడ్డు పనులను పరిశీలించిన మాజీ మేయర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో అనేక రోజులుగా పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు త్వరలో పూర్తికానున్నాయని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు. సోమవారం బోడుప్పల్ లోని బచ్ ఫన్ స్కూల్ మెడిప్లస్ నుండి అమృత బార్ వద్ద ఉన్న మెడిప్లస్ వరకు వేయనున్న కొత్త సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా రూ. 32 లక్షల వ్యయంతో ఈ పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు.






