15 June, 2026 | 7:21 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

మహిళా మావోయిస్టుకు గాయాలు

05-10-2025 12:25 AM
  1. ఐఈడీ అమర్చుతుండగా పేలడంతో ఘటన  
  2. బాధితురాలిని వదిలి పరారైన సహచరులు

చర్ల, అక్టోబర్ 4, (విజయక్రాంతి): చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిలా మద్దీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందేపారా అడవిలో మావోయిస్టులు ఐఈడీ అమర్చుతుండగా అది పేలడంతో మావోయిస్టు సభ్యురాలు తీవ్రంగా గాయపడింది.  సంఘటన అనంతరం ఆమె సహచ రులు గాయపడిన సభ్యురాలిని అడవిలో వదిలి పారిపోయారు.

దీంతో స్థానికులు పోలీసులకు సమచారం అందించడంతో గాయపడిన మావోయిస్టురాలిని గ్రామస్తుల సహాయంతో బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా గుజ్జా సోధి కొన్ని సంవత్సరాలుగా ఏసీఎం -కన్నా బుచ్నాతో పాటు మద్దీద్ ఏరియా కమిటీలో పార్టీ సభ్యురాలిగా చురుగ్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

సమాజం నుంచి దారి తప్పిన యువత హింస మార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు.