విద్యార్థులకు, ప్రజా ప్రతినిధులకు జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో సన్మానం
జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్
కామారెడ్డి, మే 28 (విజయక్రాంతి): జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గౌడ విద్యార్థులకు, అలాగే ఇటీవల ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర నాయకులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జై గౌడ ఉద్యమ జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ గురువారం తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమం కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బీఈడీ కళాశాల లో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, సామాజిక సేవ,ప్రజా నాయకత్వ రంగాల్లో ప్రతిభ కనబరిచిన గౌడ బంధువులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి మాట్లాడుతూ, గౌడ సమాజ యువత, విద్యా రంగంలో మరింత ముందుకు రావాలని, అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిగా నిలపాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఇటీవల గ్రామాలు, పట్టణాల్లో ప్రజా సేవకు ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులను సన్మానించడం ద్వారా సమాజ ఐక్యతను చాటాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి గౌడ బంధువులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమ ఏర్పాట్లలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, నరేష్ గౌడ్, కరోల్ల శేఖర్ గౌడ్, అంకన్న గారి గంగాధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.






