28 May, 2026 | 5:15 PM

ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

28-05-2026 04:03 PM

ముకరంపుర, మే 28(విజయక్రాంతి): నందమూరి తారక రామారావు  103వ జయంతి వేడుకలు గురువారం  కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి  ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి, అనంతరం పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు.తరువాత హైదరాబాద్ రోడ్డు లో గల ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల తొ అలంకరణ చేయడం .అక్కడి నుండి అన్న గారి పేరు మీద బైపాస్ లోని తీగల వంతెన వద్ద ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర వృద్ధ ఆశ్రమం లో గల 200 మంది వృద్ధులకు అన్నప్రసాద వితరణ, మార్కెట్ లోని వెంకటేశ్వర గుడి వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 400 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగుల బాల గౌడ్,రొడ్డ శ్రీనివాస్,సంద బోయిన రాజేశం,రొడ్డ శ్రీధర్, తదితర నాయకులు పాల్గొన్నారు.