6 June, 2026 | 9:54 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

బదిలీపై వెళ్తున్న డీవైపీఎం సన్మానం

06-06-2026 08:32 PM

నస్పూర్,(విజయక్రాంతి): సింగరేణి సంస్థలో ఇటీవల జరిగిన బదిలీల్లో శ్రీరాంపూర్ ఏరియా పర్సనల్ విభాగంలో డీవైపీఎం(డిప్యూటీ పర్సనల్ మేనేజర్ ) గా విధులు నిర్వహిస్తున్న  M. రాజేష్ కార్పోరేట్ కు బదిలీ అయ్యారు. శనివారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి రిలీవ్ అవుతున్న సందర్భంగా డీజీఎం(పర్సనల్) ఎస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పర్సనల్ విభాగం అధికారులు, ఉద్యోగులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం(పర్సనల్) ఎస్ . అనిల్ కుమార్, గుర్తింపు సంఘం జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, డీవైపీఎం కిరణ్ కుమార్, సీనియర్ పీఓలు ప్రశాంత్, సురేందర్, సంక్షేమ అధికారి రమేష్ నాయక్, పర్సనల్ విభాగం క్లరికల్ స్టాఫ్, గుర్తింపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.