చంచల్‌గూడలో ‘ఫీల్ ది జైల్’
- సామాన్య పౌరులు కారాగార జీవితాన్ని అనుభూతి చెందేలా కార్యక్రమం
- ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- 24 గంటల ఖైదీ జీవితానికి రూ.2 వేలు, 12 గంటల సమయం కోసం రూ. వెయ్యి ఛార్జీ
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): సామాన్య పౌరులు కారాగార జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెం దేలా చంచల్‌గూడ సెంట్రల్ జైలులో వినూత్న కార్యక్రమా న్ని ప్రారంభించారు. రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమాన్ని మంగళవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. అలాగే జైలు చరిత్రను తెలిపేలా ‘జైల్ మ్యూ జియం’ను కూడా ప్రారంభించారు.
నిజాం కాలం నాటి చంచల్‌గూడ జైలు చరిత్ర, ఆ కాలంలో ఖైదీలకు వేసిన సంకెళ్లు, ఆయుధాలు, ఉరి తీసే తాడు, పాత రికార్డులు వంటి అనేక చారిత్రక విశేషాలను ఇక్కడ ప్రదర్శనకు ఉం చారు. అంతేకాకుండా నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం లో ఖైదీలు అందించిన సహకారం, జైలు పరిశ్రమల వివరాలను కూడా పొందుపరిచారు.
సామాన్యులు నిర్ణీత ఫీ జు చెల్లించి జైలులో ఒక రోజు పాటు ఖైదీలా గడపవచ్చు. అచ్చం ఖైదీలు ధరించే దుస్తులే వేసుకుని, వాళ్లు ఉండే బ్యారక్లోనే ఉంటూ, జైలు నిబంధనల ప్రకారం అధికారులు పెట్టే భోజనం చేస్తూ కారాగార జీవితాన్ని అను భవించవచ్చు. 24 గంటల పాటు జైలులో ఖైదీలా గడపాలనుకునే వారు రూ. 2,000, అలాగే 12 గంటల సమయం కోసం రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది.






