23 March, 2026 | 5:45 AM

సిద్దిపేట బయలుదేరిన రైతులు

23-03-2026 12:32 AM

నిజాంసాగర్ మార్చి 22( విజయక్రాంతి): ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని, మహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండలాలకు చెందిన రైతులు సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ కర్మగారాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడంతో అట్టి కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని రైతులు నాలుగు బస్సుల్లో తరలి వెళ్లారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు అమర్ ప్రసాద్, జ్యోత్స్న ప్రియదర్శిని లు పాల్గొన్నారు.