7 May, 2026 | 3:11 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

07-05-2026 12:00 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, మే 6 (విజయక్రాంతి)  : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దానిలో భాగంగానే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. ’ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మార్కెటింగ్, అనుబంధ శాఖలు ఉద్యాన పట్టు పరిశ్రమ, పశు సమర్థక శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో మూడవ రోజు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

దీనిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. రైతులకు సాగు పెట్టుబడి కోసం రైతు భరోసా, అకాల మరణం సంభవిస్తే కుటుంబానికి అండగా రైతు భీమా పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్, పోలీసులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, రైతులు కూడా గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తదుపరి వ్యవసాయ మార్కేట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట మార్కెట్లో మామిడి మార్కెట్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేస్తున్నారని త్వరలోనే పేట మార్కెట్ లో మామిడి మార్కెట్  ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, జిల్లా సహకార అధికారి ప్రవీణ్ కుమార్, వెటర్నరీ డిడి శ్రీనివాస్, జిల్లా ఆర్టికల్చర్ అధికారి నాగయ్య, కెవికె సైంటిస్ట్ నరేష్ సెక్రెటరీ ముకురం ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.