calender_icon.png 19 February, 2026 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు యాంత్రీకరణను వినియోగించుకోవాలి

19-02-2026 02:33:52 PM

సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు

కాగజ్ నగర్(విజయ క్రాంతి): పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద రూ.1 కోటి 30 లక్షల విలువ గల వ్యవసాయ పనిముట్లను సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతులు విస్తృతంగా వినియోగించుకొని పంట దిగుబడులను పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ఎటువంటి వడ్ల కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం ద్వారా రైతులకు మేలు చేకూర్చినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్యాడి బైలరు, పవర్ రొటోవేటర్, పవర్ ప్లవు, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ తదితర ఆధునిక వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సిద్ధల దేవయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, ఏఈవోలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.