25 July, 2026 | 11:58 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఆయిల్ కొనుగోలుకు...పెట్రోల్ ఫ్రీ అవకాశాన్ని రైతులు వినియోగించుకోండి

20-11-2025 05:50 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సర్వో ఆయిల్, ఇండియన్ ఐఓసీల్ చేపట్టిన ఆయిల్ అమ్మకంలో భాగంగా 900 ఎంఎల్ ఆయిల్ కొనుగోలుకు 900 ఎంఎల్ పెట్రోల్ ఫ్రీ.. డీజిల్ వాహనాల ఆయిల్ కొనుగోలుపై అదేవిధంగా డీజిల్ ఫ్రీ.. కార్యక్రమాన్ని గురువారం దేవునిపల్లి పెట్రోల్ పంపు వద్ద చేపట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని రైతులు, వినియోగదారులు వినియోగించుకోవాలని చిన్న కలువల సింగల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు, కంపెనీ నుండి విచ్చేసిన సేల్స్ మెన్ రాజేశ్వరరావులు తెలిపారు. గురువారం ప్రారంభమైన ఈ కార్యక్రమం శుక్రవారంతో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి వల్లకొండ రమేష్, సిబ్బంది రైతు సోదరులు, వినియోగదారులు పాల్గొన్నారు.