8 May, 2026 | 1:58 AM

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి : కలెక్టర్

08-05-2026 12:00 AM

బోథ్. మే 7.( విజయ క్రాంతి): రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో పంటలను సాగు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ . రాజర్షి షా పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రైతు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ రకాల యంత్రాల వినియోగం కోసం రాయితీలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

వ్యవసాయంలో కూలీల కొరత అధిగమించేందుకు యాంత్రికరణమే సరైన మార్గం అన్నారు.డ్రోన్ల ద్వారా పురుగుమందులను పిచికారి చేస్తే సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందన్నారు. నిషేధిత పురుగుమందులను వాడవద్దని ప్రకృతి వ్యవసాయం వైపు ముగ్గు చూపినట్లయితే అధిక దిగుబడులు వస్తాయన్నారు.సహజ వనరులతో సాగు చేస్తే ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడం వల్ల రైతులు దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతున్నారు అన్నారు

ఒకే పంట సాగు చేయకుండా అన్ని రకాల పంటలను సాగు చేయాలని విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్ ఉన్నట్టుగల వద్దని తీసుకోవాలని సూచించారు. జిసిసి ద్వారా కొనుగోలు జరిగేలా చూస్తామన్నారు. నానో బీఏపీ వాడకం ద్వారా దిగుబడి పొందిన రైతులని కలెక్టర్ సన్మానించారు. అంతేగాక వివిధ రకాల వ్యవసాయ యంత్రాలతో ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి సోలార్ విద్యుత్ పైన అవగాహన కలిగేలా రైతులకు వివరించారు.

ఈ సందర్భంగా డ్రోన్ల వినియోగంపై కలెక్టర్ పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి సహాయ వ్యవసాయ అధికారి శివకుమార్ చీఫ్ ఇంజనీర్ చౌహన్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ సర్పంచ్ అన్నపూర్ణ ఉప సర్పంచ్ విజయలక్ష్మి శాస్త్రవేత్త ప్రవీణ్ స్థానిక ఏవో రవితేజ తహసిల్దార్ సుభాష్ చంద్ర ఎంపీడీవో రమేష్ పలు గ్రామాల రైతులు అధికారులు పాల్గొన్నారు.