విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లాలు సిద్ధంగా ఉండాలి
లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహల్
వనపర్తి , మే 7: భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కేంద్ర విపత్తు నిర్వహణ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహల్ ఆదేశించారు.కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తులను ఎదుర్కొనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజ్ప పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అకస్మాత్తుగా భారీ వర్షాలు, వరదలు, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు, అడవుల్లో మంటలు, రోడ్డు, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలి, ప్రాణ నష్టం లేకుండా క్షతగాత్రులను ఎలా రక్షించాలి, కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా ఉండాలనే అంశాలపై అధికారులు టేబుల్ ఎక్స్సజ్ చేయాలని సూచించారు. మే 15 వరకు టేబుల్ ఎక్స్సజ్ నిర్వహించి, మే 18న మాక్ డ్రిల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బాధ్యతలను ప్రాక్టికల్గా చేస్తేనే ప్రమాద సమయంలో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణలో 13 జిల్లాలను వరద ప్రమాద జిల్లాలుగాను, 5 జిల్లాలను పరిశ్రమల ప్రమాద జిల్లాలుగాను, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లాలను అగ్ని ప్రమాద జిల్లాలుగా గుర్తించినట్లు వెల్లడించారు.వీడియో కాన్ఫరెన్స్లో ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, సెక్రెటరీ హరిచందన దాసరి, వనపర్తి జిల్లా నుండి వనపర్తి అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్య నాయక్, జడ్పీ సీఈఓ యాదయ్య, సీపీఓ హరికృష్ణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ బి. ధర్మ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు






