8 May, 2026 | 1:03 AM

ఖచ్చితమైన జనాభా లెక్కలు దేశ ప్రగతికి పునాది

08-05-2026 12:00 AM

అయిజ మే 7 అయిజ మునిసిపాలిటిలో 2027 జన గణన అవగాహన ర్యాలీ మునిసిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసిల్దార్ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్మన్ సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాలు ప్రజలందరికి అందాలంటే ప్రతి ఒక్కరు జన గణనలో భాగస్వాములు  కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం తాసిల్దార్ జ్యోతి , మున్సిపాలిటీ కమిషనర్ చంద్రశేఖర రావులు మాట్లాడుతూ ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యే ప్రతి వివరము రేపటి ప్రణాళికకు దిక్సూచి కావున ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. మే 5 వతేది నుండి జూన్ 11 వరకు అధికారులు ప్రతి ఇంటికి వస్తారు వారితో ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని ప్రతి పౌరుడు బాధ్యయుతంగా ఈ ప్రక్రియలు పాల్గొనాలని  వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రెవెన్యూ మరి మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.