సర్కారు రాదారికి రైతులు బలి!
రైతుల భూముల్లోంచి వేగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం
- నష్టపరిహారం ఇవ్వకుండానే భూసేకరణ
- సమాధానం ఇవ్వని అధికారులు, కాంట్రాక్టర్లు 2 కోట్ల విలువైన భూమికి 36 లక్షలు ఇస్తామంటున్న అధికారులు
- లబోదిబోమంటున్న రైతులు
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం అధికారులు వందలాది రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములను సేకరిస్తామని చెప్పి న ప్రభుత్వ పెద్దలు.. అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో రైతులను పోలీసుల సహకారంతో బెదిరించి, 2016 భూసేకరణ సవరణ చట్టం ప్రకారం అధికారులు తమ భూములను తీసుకుంటున్నట్టు రైతులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) రావిర్యాల ఎగ్జిట్ పాయింట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని కుర్మిద్ద తదితర గ్రామాల మీదుగా ఆమన్‌గల్ మీదుగా సుమారు 40 కి.మీ పొడవైన గ్రీన్‌ఫీల్డ్ హైవేను ప్రభుత్వ నిర్మిస్తోంది.
ఈ హైవే వెడల్పు 330 ఫీట్లు. ఇందులో భాగంగా సుమారు 18 కి.మీ పొడవైన గ్రీన్‌ఫీల్డ్‌హైవే కోసం ఇప్పటికే సుమారు 1,100 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం రెవెన్యూశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం 40 కి.మీ పొడవైన హైవే కోసం సుమారు 4 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.
ఒక్క పైసా ఇవ్వలేదు..
వాస్తవానికి భూసేకరణను.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేయాలి. అయితే ఈ చట్టా న్ని తిరిగి తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నేత లు.. ఆ చట్టం ప్రకారం చాలా ప్రక్రియ ఉండటంతో.. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన భూసేక రణ సవరణల చట్టం ప్రకారం గుట్టుచప్పుడు కాకుండా భూసేకరణ పని కానిచ్చేస్తు న్నారు.
అయితే చట్టం ఏదైనప్పటికీ.. ప్రభుత్వం ఒక్కపైసాకూడా చెల్లించకుండా.. అసలు ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పకుండా.. గ్రామ సభ లు నిర్వహించకుండానే.. ఎవరూ అంగీకరించకుండానే భూసేకరణ చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. పోలీసులను ముందు పెట్టి.. ప్రజలను భయపెట్టి భూముల్లో హద్దులు పాతి.. హైవే పనులను వేగంగా చేస్తున్నట్టు రైతు లు ఆరోపిస్తున్నారు. ఇందులో చాలా మంది రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు మాత్రం వేగంగా జరుగుతుండటం గమనార్హం.
2 కోట్ల విలువైన భూములకు 36 లక్షలేనా..
వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరిగాయి. గత ప్రభుత్వం.. భూముల విలువలను పెంచడంలో కృతకృత్యమయ్యింది. ఈ నేపథ్యం లో రాష్ట్రంలోని ఏ మూలకు వెళ్ళినా.. తక్కువలో తక్కువ రూ. 25 లక్షలపైనే ఎకరం భూమి ధర పలుకుతోంది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఈ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
యా చారం మండలంలో గతంలో ఫార్మాసిటీకి.. ప్ర స్తుతం ఫ్యూచర్ సిటీకి అని చెప్పుకుంటున్న గ్రామీణ ప్రాంతాల్లో.. కనీసం కోటి వరకు ఎకరానికి ధర పలుకుతోంది. రోడ్డును ఆ నుకుని ఉంటే.. రూ. 2 కోట్ల వరకు.. ప్రధాన రహదారి ఉంటే.. రూ. 3 కోట్లకుపైగా ధర ఉంటోంది. అ యితే గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం సేకరిస్తున్న భూమికి సంబంధించి.. పట్టాభూమి అయితే.. రూ. 36 లక్షలు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ వాగ్ధానం చేసినట్టుగా..
2013 భూ సేకరణ చ ట్టం ప్రకారం చూసుకుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ధరలకు 4 రెట్లు ఇవ్వాల్సి ఉండగా.. గతంలో ఫార్మాసిటీకి ప్రకటించినట్టుగా ఎకరానికి రూ. 12 లక్షల చొప్పు న.. మూడు రెట్లు.. అంటే రూ. 36 లక్షలు ఇస్తామని అధికారులు చెబుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కె ట్లో రూ. 2 కోట్ల వరకు (రోడ్డును ఆనుకుని ఉన్న భూములు) ధర ఉన్న భూములకు రూ. 36 లక్షలతో సరిపెట్టడం..
పైగా.. ఎలాంటి అంగీకారం ఇవ్వకుండానే.. నష్టపరిహారం చెల్లించకుండానే.. భూ ములను తీసుకుని, హద్దులు పాతి.. హైవే నిర్మాణ పనులు చేస్తుండటంపై రైతులు భగ్గుమంటున్నారు. పబ్లిక్, ప్రైవేటు భాగ స్వామ్యంలో చేపడితే.. అభివృద్ధి చేసిన ప్రాజెక్టులో ఒక ఎకరానికి కొంత స్థలాన్ని బాధి తులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఎంత స్థలం ఇస్తామనేదానిపైనా అంగీ కారం రాలేదు. అంటే చట్టం పరిధిలో చేయాల్సిన.. ఒక్క భూసేకరణ నోటిఫికేషన్ మినహా, మరెలాంటి చర్యలు తీసుకోకుండానే భూములను చదునుచేసి హైవే నిర్మాణ పనులు చేపడుతున్నారు.
పోలీసులను చూపెట్టి భయపెడుతున్నారు..
పై ఫొటోలో కనపడుతున్న రైతు పేరు ఇస్లావత్ రాజు. యాచారం మం డలం మర్లకుంట తాండాకు చెందిన గిరిజన రైతు. ఆయన కుటుంబానికి మొత్తం 28 ఎకరాల పట్టాభూమి ఉంది. అధికారులు చెబుతున్నట్టు ఫ్యూచర్ సిటీ (గతంలో ఫార్మా సిటీ)లో ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం ఇస్లావత్ రాజుకు చెందిన 4 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది. ఒక్కో ఎకరానికి రూ. 36 లక్ష లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు.
అయినా అధికారులు ఇస్లావత్ రాజు పట్టాభూమి నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవేకోసం హద్దులు పాతారు. రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండానే ఎలా భూము లు తీసుకుంటారని ప్రశ్నిస్తే.. ‘పోలీసులను చూపెట్టి భయపెడుతున్నారు. పైగా ఎలాంటి అంగీకారం ఇవ్వకు న్నా, నా పట్టా భూములను ఆన్‌లైన్ నుంచి తీసేశారు’ అని ఆ గిరిజన రైతు రాజు వాపోతున్నాడు. తన కుటుంబ అవసరానికి భూమిని అమ్ముకుందామంటే.. ఆన్‌లైన్‌లో లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. భూమికి భూమి ఇవ్వాలని అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వేగంగా హైవే నిర్మాణ పనులు..
చట్ట ప్రకారం చెప్పుకోవాలంటే.. భూసేకరణ పనులు ఇంకా పూర్తికాలేదు. గ్రామ సభలు నిర్వహించలేదు. రైతులు, బాధితులు ఒప్పుకోలేదు. నష్టపరిహారం ఇవ్వలేదు. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పను లు మాత్రం వేగంగా సాగుతున్నాయి. గతంలో ఫార్మా సిటీ కోసం చేసిన భూసేకరణను ఆధారంగా చేసుకుని గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు వేగంగా సాగుతున్నాయి. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా అసైన్డ్ రైతులకు ఒక్కో ఎకరానికి రూ.8 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించి భూములను ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఆ భూముల్లో హైవే నిర్మాణ పనులను వేగంగా చేస్తున్నారు.
ఇక పట్టా భూముల్లో హద్దులను పాతిన అధికారులు.. అక్కడకూడా టిప్పర్లు, బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో నిర్మాణ పనులను చేపట్టడం గమనార్హం. గ్రీన్‌ఫీల్డ్‌హైవేను పరిశీలిస్తే.. ప్రభుత్వం చెబుతు న్నదానికి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఎలాంటి పొంత నలేకుండా, బలవంతం గా, రైతులతో ఎలాంటి అంగీకారం కుదరకుండానే.. నష్టపరిహారం చెల్లించకుం డానే ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్టుగా రైతులు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నట్టుగా అర్థమవుతోంది.

2013 భూసేకరణ చట్టం అమలుచేస్తామన్నారుగా..
ఎన్నికల సమయంలో 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తామని, భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని పలికిన కాం గ్రెస్ నేతలు.. ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పెట్టారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణల చట్టం-2016 (21 ఆఫ్ 2017 యాక్ట్) ప్రకారం భూములను సేకరిస్తోంది. 2013 భూసేకరణ చట్టంలో.. భూసేకర ణతో సామాజిక ప్రభావంపై అధ్యయనం (సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్-ఎస్‌ఐఏ) చేయాల్సి ఉంటుంది.
కనీసం 80 శాతం మంది భూసేకరణ బాధితులు దీనికి అంగీకరించాల్సి ఉం టుంది. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలోఅయితే కనీసం 70 శాతం మంది భూమి కోల్పోయిన భాదితులు అంగీకరించాలి. ఇక నష్టపరిహారం విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే మార్కె ట్ ధరకు కనీసం నాలుగు రెట్లు పరిహారంగా చెల్లించాలి. అదే అర్బన్ ప్రాంతంలో అయితే రెండు రెట్లు ఇవ్వాలి. భూ యాజమాన్యంతో సంబంధం లేకుండా సహాయ, పునరావాస చర్యలు తీసుకోవాలి.
గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ బీఆర్‌ఎస్ తీసుకొచ్చిన సవరణల చట్టంలో తీసేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అప్పటి ప్రభుత్వం పంథాలోనే వెళుతోంది. గ్రీన్‌ఫీల్డ్ హైవేకు గతంలో ఫార్మాసిటీకి తీసుకున్న భూములను కూడా ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం.
కవుల సరస్వతి, సామాజిక కార్యకర్త




