23 June, 2026 | 2:25 PM

Breaking News

పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •   రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం   •   సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్   •   ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్   •   గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి   •   డ్రైనేజీ సమస్యతో తేజాపూర్ వాసుల అవస్థలు   •   హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణపై చ‌ర్చలు సఫలం   •   తడిసిన ధాన్యం పేరుతో రైతుకు టోకరా!   •  

తడిసిన ధాన్యం పేరుతో రైతుకు టోకరా!

23-06-2026 01:17 PM
  1. శివ బాలాజీ  రైస్ మిల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి
  2. తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పిన పట్టించుకోని మిల్లు యాజమాన్యం...50 బస్తాలు కటింగ్ వైనం.
  3. జిల్లా కలెక్టర్ చొరవతో రైతుకు న్యాయం జరగాలి

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని రావులపల్లి గ్రామానికి(Ravulapalli village) చెందిన రైతు కసిరబోయిన కిష్టయ్య (తండ్రి కోటయ్య)కు ధాన్యం విక్రయంలో(Grain Sale) శివ బాలాజీ రైస్ మిల్ యాజమాన్యం(Shiva Balaji Rice Mill Management) నియంత పోకడతో రైతులు కష్టాలు చవిచూస్తున్నారు. రావులపల్లి గ్రామంలో. రైతు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 129 బస్తాల ధాన్యాన్ని తూకం వేయగా, నేరేడుచర్లకు చెందిన శివ బాలాజీ రైస్ మిల్ నిర్వాహకులు తడిసిన ధాన్యమని పేర్కొంటూ 50 బస్తాలు కటింగ్ చేస్తేనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటామని, లేకుంటే లారీని అన్‌లోడ్ చేయబోమని చెప్పినట్లు సమాచారం.దీంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతు, తోటి రైతుల ఒత్తిడి మధ్య బలవంతంగా ఆ నిబంధనకు అంగీకరించాల్సి వచ్చిందని సమాచారం.

ఈ విషయాన్ని సంబంధిత ఏపీఎం  దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు.ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలనలో భాగంగా రైతుల తడిసిన ధాన్యాన్ని తప్పనిసరిగా జిల్లా అధికారులు కొనుగోలు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసినప్పటికీ  రైతులకు అన్యాయం కొనసాగుతూనే ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతుకు న్యాయం చేయాలని, తడిసిన ధాన్యం పేరుతో జరుగుతున్న కోతలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.