17 March, 2026 | 3:30 PM

తీరని విషాదం.. భోజనం చేస్తూ 'పొర' పోయి రైతు మృతి

17-03-2026 01:43 PM

భోజనం చేస్తూ 'పొర' పోయి రైతు మృతి

​తలకొండపల్లి,(విజయ క్రాంతి) కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాల్సిన ఆ సమయం ఆ ఇంట్లో తీరని శోకాన్ని నింపింది. ముద్ద నోట్లోకి వెళ్తే ప్రాణం నిలవాల్సింది పోయి, అదే ముద్ద ప్రాణం తీసిన ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది.​తలకొండపల్లి గ్రామానికి చెందిన ఉప్పనమోని ఇంద్రయ్య (42) వృత్తిరీత్యా రైతు. ఆదివారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ భోజనం చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఒక్కసారిగా అన్నం పొర (గొంతు పట్టడం) పోయింది. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారి ఇంద్రయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఇంద్రయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కళ్ల ముందే భోజనం చేస్తూ ఇలా అనంత లోకాలకు వెళ్లిపోతాడని ఊహించలేదు అంటూ కుటుంబ సభ్యులుకన్నీరుమున్నీరవుతున్నారు.​మృతుడు ఇంద్రయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కేవలం పొర పోవడం వల్ల మరణించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.