14 June, 2026 | 3:02 AM

షాదీ ముబారక్‌లో నకిలీ పెళ్లిళ్లు

14-06-2026 12:00 AM
  1. రూ.30 లక్షల మేర స్వాహా!
  2. తప్పుడు ధ్రువపత్రాలతో భారీ అక్రమాలు
  3. బడంగ్‌పేట ఆర్‌ఐ సహా మరో ఐదుగురి అరెస్టు

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): మైనారిటీ కుటుంబాలకు చెందిన నూతన వధువులకు ఆర్థిక సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీ ముబారక్ స్కీమ్‌లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. నకిలీ పెళ్లిళ్లు.. తప్పుడు ధ్రువపత్రాలు.. అక్రమ దరఖాస్తులతో ప్రభు త్వ ఉద్యోగులు దాదాపు రూ.30 లక్షలు స్వాహా చేసినట్లు తెలుస్తుంది.

నిబంధనలు సమక్రమంగా అమలు చేయాల్సిన అధికారులే పేదల పెళ్లిళ్లను ఆసారాగా చేసుకుని యేథేచ్ఛగా సాగించిన ఈ అవినీతి బాగోతం హైదరాబాద్‌లో తాజాగా శనివారం బట్టబయలైంది. ఈ స్కామ్‌లో బడంగ్‌పేట ఆర్‌ఐ సహా మరో ఐదుగురిని రాజేంద్రనగర్ టా స్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పెళ్లిళ్లు సృష్టించి, అందుకు కావాల్సిన నకిలీ పెళ్లి పత్రికలతో షాదీ ముబాకర్ పథకానికి దరఖాస్తు చేసుకుని, లక్షలాది రూపాయలను కొల్లగొట్టడానికి ప్రయత్నించిన ముఠా సభ్యులను రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

బడంగ్ పేట రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అశోక్ కిరణ సహా మరో ఐదుగురు పోలీసులు అరెస్టు అయిన వారిలో ఉన్నా రు. ఎండీ ఇంత్తేమాద్, ఎండీ అక్బర్, సయ్య దు ముషారఫ్, సర్పరాజ్, జప్పార్‌ను అరెస్ట్ చేశారు. షాదీ ముబారక్ స్కీమ్‌లో రూ.30 లక్షల మేర కాజేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం నకిలీ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డుల సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆర్‌ఐ అశోక్ కిరణ్ కమీషన్ తీసుకుని తప్పుడు దరఖాస్తులను ప్రాసెస్ చేశారు.

షాదీ ముబారక్ పథకంలో అక్రమాలను గుర్తించి, నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు.. వారిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని పిలిపించి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నా రో గుర్తించి, చర్యలు తీసుకోవ డంలో పోలీసులు నిమగ్నమయ్యారు. రెవెన్యూ కార్యాల యంలో ఉన్న అధికారే ఏకంగా ఈ వ్యవహారంలో ఏజెంట్లకు సహకరిస్తున్న తీరు అంతా చర్చనీయాంశంగా మారింది.

ఎన్ని షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీపథకాలకు నకిలీ పత్రాలతో నిందితులు దరఖాస్తు చేసుకున్నారు? గతంలో ఇలా ఏమైనా తీసుకు న్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బండ్లగూడ తహసీ ల్దార్ కార్యాలయంలోనే ఈ వ్యవహారం జరిగిందా? రాజేంద్రనగర్ మండలంలో ఏమైనా ఇలాం టి కేసులు ఉన్నాయా? అని సైతం అత్తాపూర్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

నకిలీ పత్రాలతో చెక్కులను తీసుకోవాలని ప్రయత్నించిన కేసులో ప్రమే యం ఉన్న రెవెన్యూ అధికారులు, ఏజెంట్ల ను పిలిపించడానికి ప్రయత్నిస్తున్నామని అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు తెలిపారు. త్వరలో పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు.