అంతయ్య ఆశయాలను కొనసాగిస్తాం
29-06-2026 07:41 PM
* సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్య నాయక్ నాయక్
అచ్చంపేట: పేద ప్రజల కోసం సిపిఎం నేత అంతయ్య పోరాట పటిమ వెలకట్టలేనిదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దేశనాయక్ కొనియాడారు. అచ్చంపేట మండలం సింగారంలో అంతయ్య 34వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ... పేదల కోసం నిరంతరం పోరాడిన ఘనత అంతన్నకు మాత్రమే దక్కిందని అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన యోధునిగా అభివర్ణించారు. నల్లమల్ల ప్రాంతానికి.. ఎర్రజెండాకి వన్నెతెచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఎంతోమంది ఎర్రజెండ్లను పట్టుకొని ముందుకు వచ్చారని చెప్పారు.






